Chandrababu: చంద్రబాబును చూసి మండుటెండలోనూ మంత్రులు వణుకుతున్నారు: అచ్చెన్నాయుడు

Atchannaidu fires on YCP Govt
  • రాష్ట్రంలో పర్యటించే హక్కు ప్రతిపక్ష నేతకు లేదా?
  • అక్రమాలు బయటపడతాయనే అనుమతి నిరాకరణ
  • శాంతియుత నిరసనకు అనుమతి ఎందుకు ఇవ్వరు?
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబునాయుడు నేడు చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా గృహ నిర్బంధంలోకి తీసుకున్న తమ నేతలను వెంటనే విడుదల చేయాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. ఓ ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా? అని ప్రశ్నించారు.

వేలాదిమందితో కుల సంఘాలు నిర్వహించే సమావేశాలకు, ర్యాలీలకు అనుమతి ఇచ్చే ప్రభుత్వం తమ శాంతియుత నిరసనకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని నిలదీశారు. చంద్రబాబు పర్యటనను చూసి మండుటెండలోనూ వైసీపీ నేతలు వణుకుతున్నారని అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో తాము చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతోనే తమ నిరసనకు అనుమతి ఇవ్వలేదని అచ్చెన్న మండిపడ్డారు. వైసీపీ వైఫల్యాలు, అవినీతి, దౌర్జన్యాలను ప్రజలకు వివరిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Chandrababu
Chittoor District
Atchannaidu
TDP

More Telugu News