Pawan Kalyan: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విశాఖలో పర్యటించాలని పవన్ నిర్ణయం

Pawan Kalyan decides to tour in Visakha ahead of municipal elections
  • ఏపీలో మున్సిపల్ ఎన్నికలు
  • పార్టీ గుర్తులపై ఎన్నికలు
  • ప్రచారానికి పవన్ వస్తే బాగుంటుందన్న విశాఖ ప్రాంత నేతలు
  • సమ్మతించిన జనసేనాని
  • రెండ్రోజుల్లో తేదీ ఖరారు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున  విశాఖలో కీలక నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. మార్చి 8వ తేదీ లోపు తన పర్యటన ఉండొచ్చని పవన్ తెలిపారు. మరో రెండ్రోజుల్లో పర్యటన తేదీ ప్రకటిస్తానని వివరించారు.

ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జనసేన ఉనికిని చాటుకోవడం పవన్ లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో మరింత బలంగా ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి తగిన సమయం అని తలపోస్తున్నారు.

కొన్నిరోజుల కిందట పవన్ విశాఖ ప్రాంత జనసేన ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి పవన్ వస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడగా, పవన్ అందుకు సానుకూలంగా స్పందించారు.
Pawan Kalyan
Municipal Elections
Vizag
Janasena
Andhra Pradesh

More Telugu News