KTR: హైదరాబాదులో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించండి: బీసీసీఐ, ఐపీఎల్ కౌన్సిల్ ను కోరిన కేటీఆర్

KTR appeals BCCI and IPL to conduct matches in Hyderabad
  • త్వరలోనే ఐపీఎల్ తాజా సీజన్
  • పరిమిత సంఖ్యలో వేదికలు ప్రకటించిన బీసీసీఐ
  • హైదరాబాదుకు దక్కని స్థానం
  • నగరంలో కరోనా వ్యాప్తి బాగా తగ్గిందన్న కేటీఆర్
  • ఇతర నగరాలతో పోల్చి చూడాలని సూచన
  • ఐపీఎల్ పోటీలు నిర్వహిస్తే పూర్తి సహకారం అందిస్తామని హామీ
త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 14వ సీజన్ కోసం బీసీసీఐ ప్రకటించిన వేదికల్లో హైదరాబాదు నగరం లేకపోవడం పట్ల మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీసీఐ కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే వేదికలను ఎంపిక చేసింది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.... రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం మ్యాచ్ లు నిర్వహించే వేదికల జాబితాలో హైదరాబాదును కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలిని బహిరంగంగా కోరుతున్నానని తెలిపారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న సమర్థవంతమైన చర్యల కారణంగా హైదరాబాదులో అత్యంత తక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని వివరించారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
KTR
Hyderabad
IPL 2021
Matches
BCCI

More Telugu News