Big B: బిగ్​ బీ అమితాబ్​ కు శస్త్రచికిత్స.. అభిమానుల ఆందోళన!

Amitabh Bachchan shares an update on his health hints at undergoing surgery
  • తన బ్లాగ్ లో వెల్లడించిన బాలీవుడ్ మెగాస్టార్
  • ఆపరేషన్ అయిందా? లేదా? అన్న దానిపై లేని స్పష్టత
  • వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులు
  • శనివారం ప్రశ్నార్థకాలతో ట్వీట్
బాలీవుడ్ మెగాస్టార్.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఏమైందో ఏమోనని కలవర పడుతున్నారు. దానికీ కారణం లేకపోలేదు. స్వయంగా బిగ్ బీనే సోషల్ మీడియాలో ‘శస్త్రచికిత్స’ అంటూ రాసుకొచ్చారు. ‘‘ఆరోగ్యం.. శస్త్రచికిత్స.. ఏం చెప్పాలి?’’ అని శనివారం రాత్రి తన ఆరోగ్య వివరాలను ఆయన అభిమానులతో పంచుకున్నారు. అయితే, శస్త్రచికిత్స చేయించుకున్నారా? చేయించుకోబోతున్నారా? అన్నది మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు.

అంతకుముందు రోజు ట్విట్టర్ లోనూ దానిపై స్పందించారు. ‘‘ఏదో అవసరానికి మించి పెరిగింది.. కట్ చేస్తే మెరుగవుతుంది.. ఇదే జీవితం. రాబోయే రోజులు ఎలా ఉంటాయన్నది అవే చెబుతాయి’’ అని రాసుకొచ్చారు. తాజాగా.. శనివారం ప్రశ్నార్థకాలతో మరో ట్వీట్ చేశారు. అయితే, ఆయన కామెంట్ పై అభిమానులు హైరానా పడుతున్నారు.

త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు గత ఏడాది బిగ్ బీ సహా ఆయన ఇంట్లోని వారు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు అభిమానుల్లో అదే ఆందోళన వ్యక్తమవుతోంది. దాని తాలూకు ప్రభావాలు ఏమైనా ఉండొచ్చా అని అనుమానిస్తున్నారు. కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ప్రస్తుతం బిగ్ బీ అజయ్ దేవ్ గణ్ తో కలిసి మేడే అనే సినిమా చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సెట్స్ లోని ఫొటోలను ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఏప్రిల్ 30న చెహ్రె, జూన్ 18న ఝుండ్ లను సినిమాలను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.
Big B
Amitabh Bachchan
Bollywood

More Telugu News