Pushpasreevani Pamula: 'వైఎస్, జగన్, భారతి' పేర్లు కలిసొచ్చేలా తన బిడ్డకు పేరు పెట్టుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి!

Naming Ceremony for AP Deputy CM Srivani Daughter
  • ఇటీవల ఆడబిడ్డకు జన్మనిచ్చిన పుష్ప శ్రీవాణి
  • 'యశ్విత శ్రీజగతి' అని నామకరణం
  • ఆశీర్వదించిన బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, వైఎస్ కుటుంబంపై తనకున్న అభిమానాన్ని మరోసారి ఘనంగా చాటుకున్నారు. ఇటీవల ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె, పాప నామకరణాన్ని నిర్వహించారు. వైఎస్ తో పాటు జగన్, ఆయన భార్య భారతి పేర్లు కలసి వచ్చేలా తమ బిడ్డకు 'యశ్విత శ్రీజగతి' అన్న పేరును పెట్టుకున్నారు.

పుష్ప శ్రీవాణి భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజు   వైఎస్ఆర్ సీపీ నాయకునిగా  పనిచేస్తున్నారన్న సంగతి తెలిసిందే. శనివారం నాడు పాప నామకరణం విజయనగరం జిల్లా చిన మేరంగి గ్రామంలో వైభవంగా జరిగింది. ఏపీ మంత్రి బొత్సతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి దంపతులు మాట్లాడుతూ, తమ బిడ్డ పేరులో తమ అభిమాన నేతలందరి పేర్లూ కలిసున్నాయని, యశ్వితలో తొలి అక్షరం వై కాగా, శ్రీజగతిలో ఎస్ తో పాటు జగన్, భారతి పేర్లు ఉంటాయని తెలిపారు.

Pushpasreevani Pamula
ys
Jagan
Naming Ceremony

More Telugu News