Vaishnav Tej: నాని వద్దన్న కథ.. కావాలన్న వైష్ణవ్!

Vaishnav Tej gives nod for a story which rejected by Nani
  • 'ఉప్పెన'తో వైష్ణవ్ తేజ్ ఘన విజయం 
  • నాని తిరస్కరించిన కొత్త దర్శకుడి కథ
  • వెంటనే ఓకే చెప్పిన 'ఉప్పెన' హీరో
  • బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్లో నిర్మాణం    
ఒక హీరో కోసం తయారుచేసుకున్న కథని సదరు హీరో ఏవో కారణాలతో తిరస్కరించడం... దానిని మరో హీరో ఒప్పుకుని హ్యాపీగా చేసేయడం మనం అప్పుడప్పుడు ఇక్కడ చూస్తూనే ఉంటాం. అలా ఒకరు వదులుకున్న సినిమాలు మరొకరు చేయగా, అవి భారీ విజయాలను సాధించిన సందర్భాలూ వున్నాయి. ఇలాంటిదే ఇప్పుడు మరొకటి చోటుచేసుకుంది.

'ఉప్పెన' సినిమాతో భారీ విజయాన్ని పొందిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ తాజాగా ఓ చిత్రాన్ని అంగీకరించాడు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి వైష్ణవ్ ఓకే చెప్పాడు. దీనికి ఓ నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తాడు. అంతవరకూ బాగానే వుంది. అయితే, ఈ కథ ముందుగా నాని వద్దకు వెళ్లిందట. అయితే, నాని ఈ కథ పట్ల అయిష్టత చూపడంతో వైష్ణవ్ ని సంప్రదించడం.. ఆయన కథ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయట. ఇది యాక్షన్ ప్రధానంగా సాగే కథతో తెరకెక్కుతుంది.
Vaishnav Tej
Nani
BVSN Prasad
Uppena

More Telugu News