ఏపీ సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

Couple committed suicide at AP Secretariat
  • పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతులు
  • పొలాన్ని ఆన్ లైన్లోకి ఎక్కించేందుకు తహసీల్దారుకు రూ. కోటి ఇచ్చిన వైనం
  • ఏడాది గడుస్తున్నా ఇంత వరకు నమోదు చేయని తహసీల్దారు
అమరావతిలోని ఏపీ సెక్రటేరియట్ వద్ద ఈరోజు కలకలం రేగింది. నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు తమ పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేశారు. పెట్రోల్ పోసుకుని అంటించుకునేందుకు యత్నించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, దుత్తలూరు తహసీల్దారు తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిట్టమూరు మండలం చిలమూరులో ఉన్న తమ పొలాన్ని ఆన్ లైన్ లో ఎక్కించేందుకు ఇప్పటి వరకు తహసీల్దారుకు రూ. కోటి ఇచ్చామని తెలిపారు. డబ్బులిచ్చి ఏడాది గడుస్తున్నా తమ పొలాన్ని ఇంత వరకు ఆన్ లైన్ లో నమోదు చేయలేదని వాపోయారు. మరోవైపు ఆత్మహత్యకు యత్నించిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Couple
Suicide attempt
AP Secretariat

More Telugu News