Bandi Sanjay: దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నారు: బండి సంజయ్

KCR deceiving Dalits says Bandi Sanjay
  • దళితులే హిందూ ధర్మ పరిరక్షకులు
  • అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు మాటేమైంది? 
  • దళితులంతా ఏకం కావాలన్న సంజయ్ 
హిందూ ధర్మ పరిరక్షకులు దళితులేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ సమాజాన్ని చీల్చేందుకు కొందరు యత్నిస్తున్నారని మండిపడ్డారు. సంత్ శిరోమణి రవిదాస్ మహరాజ్ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రవిదాస్ మహరాజ్ కు బండి సంజయ్ నివాళి అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, పేదల జయంతి కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుర్తుండవని బండి సంజయ్ విమర్శించారు. అంబేద్కర్, రవిదాస్ మహరాజ్ జయంతి కార్యక్రమాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.

హైదరాబాద్ నడిబొడ్డున భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. మోచీలకు చెప్పులు కుట్టడమే కాకుండా, మొలలు కొట్టడం కూడా వచ్చని హెచ్చరించారు. బీసీలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారని... అవి ఎక్కడ ఉన్నాయని అడిగారు. దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దళితులంతా ఏకమై, ప్రభుత్వ అన్యాయాలపై పోరాడాలని అన్నారు.
Bandi Sanjay
BJP
KCR
TRS

More Telugu News