Vijayawada: గన్నవరం విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన స్పైస్ జెట్ విమానం!

Hense For near Vijayawada Airpoty
  • విజయవాడ పరిధిలో దట్టంగా పొగమంచు
  • విమానాల రాకపోకలకు అంతరాయం
  • ఉదయం 8.30 గంటల తరువాత అనుమతి
విజయవాడ శివార్లలోని గన్నవరం విమానాశ్రయం పరిధిలో పొగమంచు దట్టంగా పడుతూ ఉండటంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఉదయం స్పైస్ జెట్, ఎయిర్ ఇండియాకు చెందిన విమానాలను రన్ వేపై ల్యాండింగ్ చేయలేక పోయిన పైలట్లు, గాల్లోనే దాదాపు గంటపాటు చక్కర్లు కొట్టారు.

బెంగళూరు నుంచి గన్నవరానికి 67 మంది ప్రయాణికులతో వచ్చిన స్పైస్ జెట్ విమానం ల్యాండింగ్ కు ఎయిర్ పోర్టు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో విమానం గాల్లోనే తిరుగుతుండగా, అందులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురి చెందారు. ఉదయం 8:30 గంటల తరువాత పొగమంచు తగ్గుముఖం పట్టడంతో విమానాల ల్యాండింగ్ కు అధికారులు అనుమతినిచ్చారని తెలుస్తోంది.
Vijayawada
Airport
Faog

More Telugu News