Amarnath Reddy: చంద్రబాబు బస చేసిన గెస్ట్ హౌస్ కు కరెంట్ కట్.. మేము కూడా షాకులిస్తామన్న అమర్ నాథ్ రెడ్డి!

TDP leader Amarnath Reddy response on power cut to Chandrababu guest house
  • చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు
  • గెస్ట్ హౌస్ కు కావాలనే కరెంట్ కట్ చేశారన్న అమర్
  • ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఆయన బస చేసిన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ అంశంపై టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు బస చేసిన గెస్ట్ హౌస్ కు కావాలనే కరెంట్ కట్ చేశారని ఆయన మండిపడ్డారు. కనీసం జనరేటర్ సౌకర్యాన్ని కూడా కల్పించలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో వైసీపీకి తాము కూడా షాకులిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు.

నిన్న కుప్పంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆయన రోడ్ షో పొడవునా టీడీపీ జెండాలు పట్టుకుని, ద్విచక్ర వాహనాలపై బారులు తీరి పయనించారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా వాహనాల శ్రేణి కనిపించింది.
Amarnath Reddy
Chandrababu
Telugudesam
Guest House

More Telugu News