Ravichandran Ashwin: వేగంగా 400 వికెట్లు సాధించిన భారత బౌలర్ గా అశ్విన్ రికార్డు

Ashwin reaches four hundred test wickets milestone
  • మొతేరాలో భారత్, ఇంగ్లండ్ టెస్టు
  • ఆర్చర్ వికెట్ తో 400వ టెస్టు వికెట్ సాధించిన అశ్విన్
  • 77 టెస్టుల్లోనే ఈ ఘనత
  • మురళీధరన్ 72 టెస్టుల్లో 400 వికెట్లు
అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో వికెట్ల పండగ నెలకొంది. స్పిన్నర్లకు ఇక్కడి పిచ్ స్వర్గధామంలా మారడంతో వికెట్లు టపటపా నేలరాలుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన భారత బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో జోఫ్రా ఆర్చర్ వికెట్ తీయడంతో అశ్విన్ టెస్టుల్లో 400వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్ కేవలం 77 టెస్టుల్లోనే ఈ మైలురాయి అందుకున్నాడు.

వేగంగా 400 టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ టాప్ లో ఉన్నాడు. మురళీధరన్ 72 టెస్టుల్లోనే 400 మార్కు అందుకున్నాడు. ఇప్పటిదాకా భారత్ లో 400 పైచిలుకు వికెట్లు తీసింది అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417) మాత్రమే. ఇప్పుడు అశ్విన్ కూడా వీరి సరసన చేరాడు.
Ravichandran Ashwin
400
Test Wickets
India

More Telugu News