Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో 13 మంది ఉద్యోగుల సస్పెన్షన్!

13 Employees Suspended from Duties in Kanakadurga Temple
  • అవినీతికి అలవాటు పడిన ఉద్యోగులు
  • ఏసీబీ సోదాల అనంతరం పక్కా ఆధారాలు
  • తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ గుడిలో అవినీతికి అలవాటు పడిన 13 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గుడిలో ఐదు రోజుల పాటు ఏసీబీ అధికారులు దాడులు చేసి, పలు కీలక పత్రాలను, అవినీతి ఆధారాలను గుర్తించి, ప్రభుత్వానికి నివేదికను ఇవ్వగా, భారీ అక్రమాలు జరిగినట్టు నిర్ధారించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సస్పెండ్ అయిన వారిలో ఐదుగురు సూపరింటెండెంట్ స్థాయి అధికారులు కూడా ఉండటం గమనార్హం.

ఇక వీరు దేవాలయం భూములు, షాపుల లీజు, దర్శనాల టికెట్ల అమ్మకం, చీరల అమ్మకం, అన్నదానం, ప్రసాదాల తయారీ వంటి అన్ని చోట్లా అవినీతికి పాల్పడినట్టు తేలడంతో, అందరినీ తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్టు దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జున్ రావు, నిన్న రాత్రి ఆదేశాలు జారీ చేశారు.
Vijayawada
Kanakadurga
Suspend
Employees
ACB

More Telugu News