Mohan Delkar: హోటల్ గదిలో శవమై కనిపించిన లోక్ సభ సభ్యుడు

MP Mohan Delkar found dead in Mumbai hotel
  • దాద్రా నగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ మృతి
  • ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు
  • గుజరాతీ భాషలో సూసైడ్ నోట్
  • ఏడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన దేల్కర్
  • 2019లో కాంగ్రెస్ ను వీడిన వైనం

దాద్రా అండ్ నగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ హోటల్ గదిలో శవమై కనిపించడం సంచలనం సృష్టించింది. ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఉన్న సీ గ్రీన్ సౌత్ హోటల్ గదిలో ఆయన విగతజీవుడిగా పడివుండడాన్ని గుర్తించారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ గదిలో గుజరాతీ భాషలో ఉన్న సూసైడ్ నోట్ లభ్యమైనట్టు తెలుస్తోంది.

సిల్వస్సా ప్రాంతంలో ఓ వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించిన మోహన్ దేల్కర్ రాజకీయాల్లో విశేష ప్రభావం చూపించారు. మోహన్ దేల్కర్ ఏడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల వేళ కాంగ్రెస్ ను వీడారు. ప్రస్తుతం ఆయన స్వతంత్ర ఎంపీగా ఉన్నారు. గతేడాది దాద్రా నగర్ హవేలిలో స్థానిక ఎన్నికల కోసం జేడీయూతో పొత్తు పెట్టుకున్నారు. 58 ఏళ్ల మోహన్ దేల్కర్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

  • Loading...

More Telugu News