Charmme: విజయ్ దేవరకొండను యాక్టివాపై ఎక్కించుకుని చార్మీ షికార్లు... ఫొటోలు ఇవిగో!

Charmme fun ride with Vijay Devarakonda in Mumbai
  • లైగర్ చిత్రంలో నటిస్తున్న విజయ్ దేవరకొండ
  • నిర్మాతగా వ్యవహరిస్తున్న చార్మీ
  • ముంబయిలో లైగర్ షూటింగ్
  • షూటింగ్ గ్యాప్ లో సరదా విహారం
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో లైగర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి చార్మీ కౌర్ సహ నిర్మాత. ప్రస్తుతం లైగర్ చిత్రం షూటింగ్ ముంబయిలో జరుగుతుండగా, విజయ్ దేవరకొండపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే షూటింగ్ గ్యాప్ లో చార్మీ... ఓ యాక్టివాపై హీరో విజయ్ దేవరకొండను ఎక్కించుకుని కాసేపు షికారు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను చార్మీ ట్విట్టర్ లో పంచుకుంది.

"మీరు చూస్తున్నారు కదా... విజయ్ నాపై గట్టి నమ్మకంతోనే బండెక్కాడు! షూటింగ్ విరామంలో ముంబయి రోడ్లపై ఇలా సరదాగా విహరించాం" అని వెల్లడించింది. లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. లైగర్ చిత్రాన్ని సెప్టెంబరు 9న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో కరణ్ జోహార్ కూడా పాలుపంచుకుంటున్నారు.
Charmme
Vijay Devarakonda
Fun Ride
Mumbai
Liger

More Telugu News