BJP: తమిళనాడులో అన్నాడీఎంకేదే విజయం: బీజేపీ నేత ఖుష్బూ జోస్యం

BJP Leader Predicts AIADMK will win in Tamil Nadu Assembly Polls
  • తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు
  • కూటమిగా బరిలోకి దిగుతున్న అన్నాడీఎంకే, బీజేపీ
  • ట్రిప్లికేన్‌లో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన ఖుష్బూ
తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి విజయం సాధించి మరోమారు అధికారంలోకి వస్తుందని బీజేపీ ఇన్‌చార్జ్, సినీ నటి ఖుష్బూ జోస్యం చెప్పారు. ట్రిప్లికేన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ కోఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి నిన్న ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఖుష్బూ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ బరిలోకి దిగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఇరు పార్టీల మధ్య ఇటీవల విభేదాలు పొడసూపగా, ప్రస్తుతం సద్దుమణిగాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్ఠానం నిర్ణయిస్తుందని బీజేపీ నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా, ఆ తర్వాత పళనిస్వామే తమ కూటమి సీఎం అభ్యర్థి అని ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.

కాగా, ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన ఖుష్బూ.. బీజేపీ రాష్ట్ర మత్స్యశాఖ అధ్యక్షుడు సతీశ్‌కుమార్, స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి ట్రిప్లికేన్‌లోని ప్రసిద్ధ  తిరువట్టీశ్వరన్‌ ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
BJP
Tamil Nadu
Khushboo
AIADMK

More Telugu News