Nagababu: మెడలో కొండచిలువతో నాగబాబు... ఫొటో ఇదిగో!

Nagababu supports wildlife and all living creatures
  • సోషల్ మీడియాలో నాగబాబు ఆసక్తికర పోస్టు
  • అన్ని ప్రాణులు సమాన హక్కులతోనే పుడతాయన్న మెగాబ్రదర్
  • ప్రతి జీవికి బతికే హక్కు ఉందని ఉద్ఘాటన
  • అందుకే ప్రేమను జీవులన్నింటికి పంచుదామని పిలుపు
  • బతుకుదాం, బతకనిద్దాం అంటూ నినాదం
అటు సినిమాలు, ఇటు టీవీ కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండే మెగాబ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలోనూ క్రియాశీలకంగా ఉంటారు. అనేక అంశాలపై స్పందిస్తుండే ఆయన తాజాగా మెడలో పెద్ద కొండచిలువతో దర్శనమిచ్చారు. మరో ఫొటోలో పడగ విప్పిన నాగుపాము ముందు కుర్చీలో కూర్చున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, ఈ సృష్టిలో అన్ని ప్రాణులు సమాన హక్కులతోనే పుడతాయని తెలిపారు.

ప్రతి జీవికి బతికేందుకు, మనుగడ సాగించేందుకు, ఎదిగేందుకు తనకంటూ ఓ హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. అందుకే మీ ప్రేమను ఈ భూమిపై జీవించే అన్ని ప్రాణులకు పంచండి, వాటి రక్షణకు పాటుపడండి అని నాగబాబు పిలుపునిచ్చారు. బతుకుదాం, బతకనిద్దాం అని ఈ సందర్భంగా ఆయన నినదించారు.

జంతువుల సంరక్షణ, వాటి హక్కుల కోసం కృషి చేసే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్), పెటా, పెటా ఇండియా సంస్థలకు మద్దతుగా ఆయన ఈ పోస్టు చేసినట్టు హ్యాష్ ట్యాగ్ ల ద్వారా అర్థమవుతోంది.
Nagababu
Living Creatures
Animals
WWF
PETA

More Telugu News