Nimmagadda Ramesh: గత మూడు రోజులుగా తిరుమలలోనే ఉన్న నిమ్మగడ్డ రమేశ్

Nimmagadda Ramesh in Tirumala since 3 days
  • మొన్న రాత్రి తిరుమలకు చేరుకున్న నిమ్మగడ్డ
  • నిన్న ఉదయం స్వామి వారి దర్శనం 
  • పాపవినాశనం, శనకనందతీర్థం డ్యాంల సందర్శన  
ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికలతో ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇదే సమయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ మాత్రం తిరుమల కొండపై ప్రశాంతంగా గడుపుతున్నారు. గత మూడు రోజులుగా ఆయన కొండపైనే ఉన్నారు. స్వామివారిని సందర్శించుకుంటూ, కుటుంబసభ్యులతో గడుపుతున్నారు.

మొన్న రాత్రి ఆయన తిరుమలకు చేరుకున్నారు. నిన్న ఉదయం వెంకన్నను దర్శించుకున్నారు. దర్శనం తర్వాత పాపవినాశనం, శనకనందతీర్థం డ్యాంలను సందర్శించారు. అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. రేపు ఉదయం కూడా స్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు.
Nimmagadda Ramesh
SEC
Tirumala

More Telugu News