విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. నేడు కేంద్ర ముఖ్యులతో మాట్లాడతా: సోము వీర్రాజు
- వైజాగ్ స్టీల్ భూములను కారు చవకగా అమ్మడాన్ని అడ్డుకుంటాం
- రాష్ట్రంలో ప్రజాస్వామ్య విరుద్ధంగా పంచాయతీ ఎన్నికలు
- మాచర్ల నియోజకవర్గంలోని 74 ఏకగ్రీవాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం
- వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసి, అధికారాన్ని కైవసం చేసుకుంటాం
రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన 74 ఏకగ్రీవాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసి, అధికారాన్ని చేజిక్కించుకుంటామని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.