Sithara: మహేశ్ బాబు, నమ్రత దంపతులకు సితార వాలంటైన్స్ డే గిఫ్టు

Sithara greets Mahesh Babu and Namrata with a beautiful card on Valentines Day
  • నేడు వాలంటైన్స్ డే
  • చేతిరాతతో కూడిన కార్డు రూపొందించిన సితార
  • తల్లిదండ్రులకు బహూకరణ
  • మురిసిపోయిన మహేశ్ బాబు
  • అందరికీ హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ శుభాకాంక్షలు
ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత దంపతులకు వారి కుమార్తె సితార వాలంటైన్స్ డే కానుక అందించింది. చేతితో రాసిన సందేశంతో కూడిన కార్డును ఎనిమిదేళ్ల సితార తన తల్లిదండ్రులకు బహూకరించింది. లవ్యూ అమ్మా, నాన్నా... హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ పేర్కొంది.

దీనిపై మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. తన ముద్దుల తనయ సితార అందించిన కార్డును ఆయన పంచుకున్నారు. "థాంక్యూ సితు పాపా" అంటూ మురిసిపోయారు. "నేను ప్రేమించే ప్రతి ఒక్కరికీ, మీరు ప్రేమించే ఇతరులందరికీ హ్యాపీ వాలంటైన్స్ డే" అంటూ శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ బాబు ఫ్యామిలీ ప్రస్తుతం దుబాయ్ లో ఉంది. మహేశ్ నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
Sithara
Mahesh Babu
Namrata
Gift
Valentines Day
Tollywood

More Telugu News