Harish Rao: బీజేపీ బాసులు ఢిల్లీలో ఉంటారు.. టీఆర్ఎస్ కు ప్రజలే బాసులు: హరీశ్ రావు

People are bosses for TRS says Harish Rao
  • తెలంగాణ ఉద్యమానికి సిద్ధిపేట పుట్టినిల్లు వంటిది
  • ఎందరో త్యాగాల పునాదుల మీద తెలంగాణను సాధించాం
  • టీఆర్ఎస్ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధిపొందింది
బీజేపీపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. బీజేపీ బాసులు ఢిల్లీలో ఉంటారని... కానీ, టీఆర్ఎస్ కు ప్రజలే బాసులని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధిపేట పుట్టినిల్లు వంటిదని చెప్పారు. ఉద్యమంలో కాని, అభివృద్ధిలో కాని సిద్ధిపేటే నెంబర్ వన్ అని అన్నారు.

తెలంగాణ కోసం పదవులను వదులుకున్నామని, ఎందరో త్యాగాల పునాదుల మీద తెలంగాణను సాధించామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల వల్ల రాష్ట్రంలోని ప్రతి కుటుంబం లబ్ధి పొందిందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని చెప్పారు. ప్రజల శ్రేయస్సే తమ పార్టీకి ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతుబంధు పథకంతో రైతులందరూ లబ్ధిపొందుతున్నారని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో నీటి సమస్యలు తొలగిపోయాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని అన్నారు.
Harish Rao
TRS
BJP

More Telugu News