Jagan: ఈ నెల 19న ఆంతర్వేదికి వెళ్తున్న జగన్

Jagan to go to Antarvedi on 19
  • లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్న జగన్
  • కొత్త రథాన్ని ఆరోజు బయటకు తీసే అవకాశం
  • పూర్ణాహుతి కార్యక్రమానికి వస్తున్న స్వరూపానంద
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి జగన్ సందర్శించుకోనున్నారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా ఈనెల 19న అంతర్వేదికి ఆయన రానున్నారు. ఈ విషయాన్ని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కొత్తగా తయారు చేసిన రథాన్ని రథసప్తమి సందర్భంగా బయటకు తీసే అవకాశం ఉందని... ఈ సందర్భంగా అంతర్వేదికి రావాలని ముఖ్యమంత్రిని కోరగా, ఆయన అంగీకరించారని చెప్పారు.

అంతర్వేది రథాన్ని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వెల్లంపల్లి మాట్లాడుతూ, రథం దగ్ధం కావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, సీబీఐ విచారణను కోరిందని తెలిపారు. అయితే, దీనిపై సీబీఐ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. ప్రస్తుతం రథానికి సంప్రోక్షణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. మూడో రోజున పూర్ణాహుతి చేసి, అన్ని రకాల పూజలు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశాఖ స్వరూపానంద స్వామి వస్తున్నారని అన్నారు.
Jagan
YSRCP
Antarvedi

More Telugu News