Volunteers: విశాఖలో సర్పంచులుగా గెలుపొందిన వాలంటీర్లు

Village volunteers elected as Surpanches
  • గ్రామాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్లు
  • ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ అందజేస్తున్న వైనం 
  • విశాఖ జిల్లాలో సర్పంచులుగా ఎన్నికైన ముగ్గురు వాలంటీర్లు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలలో వాలంటీర్ల వ్యవస్థ ఒకటి. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు గ్రామాల్లో ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో పలువురు వాలంటీర్లు కూడా పోటీ పడ్డారు.

వీరిలో విశాఖ జిల్లాలోని మునగపాక మండలం మెలిపాకలో అయినంపూడి విజయభాస్కరరాజు, బుచ్చయ్యపేట మంగళాపురానికి చెందిన పద్మరేఖ, కశింకోట మండలం జమాదులపాలేనికి చెందిన కరక రాజ్యలక్ష్మిలు సర్పంచులుగా గెలుపొందారు. గ్రామస్థుల కోరిక మేరకు వీరు ఎన్నికల్లో పోటీ చేయడం గమనార్హం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామస్థుల అభిమానాన్ని పొందడం వల్లే ఈ విజయం సాధ్యమయిందని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు వారు ధన్యవాదాలు తెలిపారు.
Volunteers
Gram Panchayat Elections
YSRCP

More Telugu News