Mallikarjun Kharge: రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా మల్లికార్జున ఖర్గే పేరును ప్ర‌తిపాదించిన‌ కాంగ్రెస్

Congress has submitted to Rajya Sabha Chairman the name of Mallikarjun Kharge as the Leader of Opposition
  • ప్ర‌స్తుతం ఆ హోదాలో ఉన్న గులాంనబీ ఆజాద్
  • ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం ఈ నెల 15తో ముగింపు
  • 2014 నుంచి ప్ర‌తి పక్షనేతగా ఉన్న ఆజాద్
రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా మల్లికార్జున ఖర్గే పేరును కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిపాదించింది. ప్ర‌స్తుతం ఆ హోదాలో ఉన్న గులాంనబీ ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం ఈ నెల 15తో‌ ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న స్థానంలో కొత్త నేతగా మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్ర‌తిపాదించింది. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంక‌య్య నాయుడికి కాంగ్రెస్ పార్టీ సమాచారం అందించింది.
 
మల్లికార్జున ఖర్గే గతంలో లోక్ సభలో ప్ర‌తి పక్ష నాయకుడిగా ఉన్న విష‌యం తెలిసిందే. కాగా, రాజ్యసభ సభ్యుడిగా ఆజాద్ 2009 నుంచి కొనసాగుతూ, 2014 నుంచి ప్ర‌తి పక్షనేతగా ఉన్నారు.
Mallikarjun Kharge
Congress
Rajya Sabha

More Telugu News