GV Anjaneyulu: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై కేసు నమోదు

Police Case files against TDP Ex MLA GV Anjaneyulu
  • రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ కేసు నమోదు
  • 144 సెక్షన్‌ను ఉల్లంఘించారంటూ ఆంజనేయులు సహా మరో వందమందిపై కేసుల నమోదు
  • అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారారన్న జీవీ
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, 144 సెక్షన్‌ను ఉల్లంఘించి పోలీస్ స్టేషన్ వద్ద మద్దతుదార్లతో గుమికూడారంటూ ఆయనతోపాటు వినుకొండ మండల మాజీ అధ్యక్షుడు మక్కెన కొండలు, శివశక్తిలీలా అంజన్ ఫౌండేషన్ మేనేజర్ గాలి రమణ, మరో 100 మందిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే, పిట్టంబండ గ్రామానికి వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ మక్కెన కొండలు సహా మరికొందరిపైనా కేసులు నమోదు చేశారు.

తనపై నమోదైన కేసు గురించి జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని ఆరోపించారు. పిట్టంబండ మహిళలతో సీఐ చినమల్లయ్య అసభ్యంగా మాట్లాడారని, బైండోవర్ పేరుతో తమ కార్యకర్తలను అర్ధరాత్రి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రుణం తీర్చుకునేందుకే ఎస్సై వెంకట్రావు తమ పార్టీ అభ్యర్థులను బెదిరించారని అన్నారు. ఈ విషయం గురించి అడిగేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తనపైనా కేసు పెట్టారని జీవీ ఆంజనేయులు తెలిపారు.
GV Anjaneyulu
TDP
Guntur District
Police

More Telugu News