Tirumala: ఒక్క రోజులోనే తిరుమల ప్రత్యేక దర్శనం కోటా ఫుల్!
- నిన్న విడుదలైన రూ. 300 కోటా టికెట్లు
- ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఫుల్
- నిన్న స్వామిని దర్శించుకున్న 45 వేల మంది
ఫిబ్రవరి నెలాఖరు వరకూ నిన్న రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయగా, గంటల వ్యవధిలోనే అన్నీ బుక్ అయిపోయాయి. మాఘ మాసం ప్రవేశించడం, 19న రథసప్తమి వేడుకలు ఉండటంతో, టికెట్లన్నీ అమ్ముడై పోయాయని, ప్రత్యేక దర్శనం కోటాను పెంచినా, డిమాండ్ అధికంగానే ఉందని అధికారులు పేర్కొన్నారు.
రోజుకు 5 వేల టికెట్లను అదనంగా జారీ చేశామని తెలిపిన అధికారులు, డిమాండ్ ను బట్టి, మరిన్ని టికెట్లను తిరుపతిలోని కేంద్రాల ద్వారా జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక గురువారం నాడు స్వామిని సుమారు 45 వేల మందికి పైగా దర్శనం చేసుకున్నారు.