Ambati Rambabu: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి: అంబటి రాంబాబు

Pawan Kalyan comments on YSRCP are ridiculous says Ambati Rambabu
  • విశాఖ స్టీల్ ప్లాంట్ పై పవన్ వ్యాఖ్యలు ఆశ్చర్యకరం
  • బీజేపీతో భాగస్వామిగా ఉన్న పవన్ తమపై విమర్శలు గుప్పించడం విడ్డూరం
  • కేంద్ర సంస్థను రాష్ట్రం ఎలా అమ్ముతుంది?
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం బాధాకరమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈ అంశంపై కేంద్రం పునరాలోచించే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని అన్నారు.

విశాఖ ప్లాంట్ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో మాట్లాడిన మాటలు తమకు ఆశ్చర్యాన్ని కలగజేశాయని చెప్పారు. బీజేపీతో భాగస్వామిగా ఉన్న పవన్... వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఢిల్లీకి వెళ్లిన పవన్ స్టీల్ ప్లాంటును కాపాడమని అడిగారా? లేక తిరుపతి లోక్ సభ సీటు ఇవ్వమని అడిగారా? అని ఎద్దేవా చేశారు.

వైజాగ్ ఉక్కు కర్మాగారాన్ని ముఖ్యమంత్రి జగన్ అమ్ముతున్నారని చంద్రబాబు అండ్ కో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమ్ముతుందనే ఆలోచన కూడా లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మే అవకాశమే ఉంటే... చంద్రబాబు ఆ పని ఎప్పుడో చేసేవారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే విశాఖ ప్లాంటు నష్టాల్లోకి వెళ్లిందని వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ప్లాంటును కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు.
Ambati Rambabu
YSR
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam
Vizag Steel Plant

More Telugu News