YS Sharmila: షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ లను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే

YSRCP MLA RK meets Sharmila
  • షర్మిల, అనిల్ లతో ఆర్కే సుదీర్ఘ మంతనాలు
  • జగన్ దూతగానే వచ్చినట్టు సమాచారం
  • ఈ నెల 21న ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్న షర్మిల
తెలంగాణలో వైయస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ అంశంపై ఏపీ వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. ఏపీ ప్రభుత్వ సలహాదాదు సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై స్పందిస్తూ... రాజకీయ పార్టీ షర్మిల సొంత నిర్ణయమని చెప్పారు. జగన్ కు, షర్మిలకు మధ్య విభేదాలు లేవని, బేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని అన్నారు.

మరోవైపు ఈరోజు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. షర్మిలను మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిశారు. ఆమెతో పాటు ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో భేటీ అయ్యారు. వీరితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. జగన్ దూతగానే వీరి వద్దకు ఆళ్ల వచ్చినట్టు తెలుస్తోంది.

మరోవైపు జిల్లాల వారీగా షర్మిల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ నెల 21న ఖమ్మంలో వైయస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. 21 ఉదయం భారీ కాన్వాయ్ తో ఆమె ఖమ్మంకు వెళ్లనున్నారు.
YS Sharmila
RK
YSRCP
Jagan

More Telugu News