Suriya: కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న హీరో సూర్య

Hero Suriya back to home after recovered from Corona
  • సూర్యకు ఇటీవల కరోనా పాజిటివ్
  • వైద్యుల పర్యవేక్షణలో చికిత్స
  • తాజాగా కొవిడ్ నెగెటివ్
  • అన్న క్షేమంగా వచ్చాడన్న కార్తి
  • కొన్నిరోజులు క్వారంటైన్ లో ఉంటాడని వెల్లడి
తమిళ హీరో సూర్య ఇటీవలే కరోనా బారినపడ్డారు. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆసుపత్రిలో చేరారు. తాజాగా, కరోనా నుంచి కోలుకోవడంతో సూర్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తన సోదరుడు సూర్య కరోనాను జయించినట్టు హీరో కార్తి వెల్లడించారు. అన్న ఇంటికి చేరుకున్నాడని, క్షేమంగా ఉన్నాడని కార్తి వివరించారు. కొన్ని రోజుల పాటు సూర్య క్వారంటైన్ లో ఉంటాడని తెలిపారు. తమ కోసం ప్రార్థనలు చేసి, శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు సరిపోవని వివరించారు.

కొన్నిరోజుల కిందట తనకు కరోనా వచ్చిన విషయాన్ని సూర్య స్వయంగా వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని, తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. అంతేకాదు, సమాజంలో పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాలేదన్న అంశాన్ని కూడా గుర్తించాలని సూచించారు.
Suriya
Corona Virus
Negative
Karthi
Kollywood

More Telugu News