Balakrishna: కర్ణాటకలో బాలకృష్ణ సినిమా షూటింగుకి ఏర్పాట్లు

Balakrishnas latest film shoot planned in Karnataka
  • బాలకృష్ణ, బోయపాటి కాంబోలో మూడో చిత్రం
  • హైదరాబాదులో ముగిసిన భారీ షెడ్యూలు
  • హోస్పేటలో తాజా షెడ్యూలుకి సన్నాహాలు 
  • రెండో గెటప్ ఇంట్రడక్షన్ సీన్స్ చిత్రీకరణ
నందమూరి బాలకృష్ణను వెండితెరపై ఎలా ప్రెజంట్ చేయాలో బాగా తెలిసిన నేటి దర్శకులలో బోయపాటి పేరు ముందుగా చెప్పుకోవాలి. బాలయ్య ఇమేజ్.. ఫాలోయింగ్.. బాడీ లాంగ్వేజ్ ... అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆయన పాత్రలను, ఆయా కథలను బోయపాటి ఫ్రేమ్ చేస్తూవుంటాడు.

గతంలో వీరి కలయికలో వచ్చిన 'సింహా', 'లెజండ్' సినిమాలు ఎంతటి విజయాలను సాధించాయో మనకు తెలుసు. ఇప్పుడీ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కూడా నిర్మాణంలో ఉండగానే ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. అందుకే, ఈ సినిమా పట్ల అటు అభిమానుల్లోనూ.. ఇటు ఇండస్ట్రీలోనూ కూడా ఎన్నో అంచనాలు వున్నాయి.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూలు షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో ముగిసింది. మరో షెడ్యూల్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఈ షెడ్యూలును కర్ణాటకలోని హోస్పేటలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో కనిపిస్తారు. ఈ రెండో గెటప్పుకు సంబంధించిన షూటింగును అక్కడ చేస్తారని సమాచారం.

రెండో గెటప్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను దర్శకుడు బోయపాటి ఒక రేంజిలో డిజైన్ చేశాడట. వీటిని అక్కడి లొకేషన్లో భారీ ఎత్తున షూట్ చేస్తారట. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 28న భారీ ఎత్తున రిలీజ్ చేస్తారు. ఇందులో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
Balakrishna
Boyapati Sreenu
Pragya Jaiswal

More Telugu News