Nara Lokesh: ఎయిమ్స్ నిర్మాణానికి సహకరించాలని ముఖ్యమంత్రి జగన్ గారికి లేఖ రాశాను: నారా లోకేశ్

Written letter to Jagan regarding cooperation to AIIMS construction says Nara Lokesh
  • ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎయిమ్స్ ఆలస్యమవుతోందని కేంద్రం చెప్పింది
  • చెత్త ఇసుక విధానం, మౌలిక వసతులు కల్పించకపోవడం వల్లే నిర్మాణం నత్తనడక నడుస్తోంది
  •  ట్విట్టర్ లో పేర్కొన్న నారా లోకేశ్  
ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎయిమ్స్ నిర్మాణం ఆలస్యమవుతోందని పార్లమెంటు సాక్షిగా కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే ప్రకటించారని టీడీపీ నేత నారా లోకేశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కు తాను లేఖ రాశానని చెప్పారు.

చెత్త ఇసుక విధానం, కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం వల్లే ఎయిమ్స్ నిర్మాణం నత్త నడక నడుస్తోందని అన్నారు. ఇప్పటికైనా ఎయిమ్స్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని కోరుతూ జగన్ కు లేఖ రాశానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. జగన్ కు రాసిన లేఖ ప్రతిని షేర్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
AIIMS

More Telugu News