Rashmika Mandanna: 'పుష్ప' వల్ల రష్మికకు నిద్ర తగ్గిపోయిందట!

Rashmika says she had only four hours sleep in pushpa outdoor shoot
  • అల్లు అర్జున్ 'పుష్ప'లో నాయికగా రష్మిక 
  • కొన్నాళ్లుగా సినిమా అవుట్ డోర్ షూటింగ్
  • రోజుకి నాలుగు గంటలే నిద్ర సమయం  
  • రష్మిక మేకప్ కోసం రెండు గంటలు  
'పుష్ప' అవుట్ డోర్ షూటింగులో చాలా కష్టపడుతున్నానని అంటోంది అందాలభామ రష్మిక. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్నాళ్లుగా అవుట్ డోర్ లొకేషన్స్ లో జరుగుతోంది. దీనిపై అక్కడ తన అనుభవాన్ని రష్మిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

"దూర ప్రాంతాలలో షూటింగ్ చేయడం వల్ల కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నాను. మా బస నుంచి షూటింగ్ లొకేషన్ చాలా దూరం కావడంతో తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేవాల్సి వస్తోంది. ఇక షూటింగ్ పూర్తిచేసుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అవుతోంది.

ఆ తర్వాత వర్కౌట్లు, డిన్నర్ పూర్తి చేసి పడుకునే సరికి 12 అవుతోంది. మళ్లీ పొద్దున్నే నాలుగు గంటలకే లేవాలి. అంటే నేను పడుకునే సమయం రోజుకి కేవలం 4 గంటలే. అలాగే, ఈ సినిమాలో నాకు స్పెషల్ మేకప్ అవసరం అవుతోంది. దీనికి రెండు గంటలు వెచ్చించాల్సివస్తోంది. ఇదొక ఛాలెంజ్ లాంటిది. అయినా, రేపు స్క్రీన్ మీద మంచి రిజల్ట్ వస్తుందిలెండి" అని చెప్పింది.

ఇక అల్లు అర్జున్ తో పనిచేయడం స్పెషల్ గా ఉందనీ, ఆయన నుంచి ఎన్నో నేర్చుకుంటున్నాననీ రష్మిక చెప్పింది. బన్నీ మంచి మనసున్న మనిషని కితాబునిచ్చింది.
Rashmika Mandanna
Allu Arjun
Sukumar
Pushpa

More Telugu News