Congress: పంచాయతీ ఎన్నికల్లో బోణీ కొట్టిన కాంగ్రెస్

At last Congress won one surpanch seat in krishna district
  • కృష్ణా జిల్లా, చిలుకూరు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ కైవసం 
  • నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహం
  • బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌ తిరిగి పుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు బూస్ట్ ఇచ్చే వార్త ఇది. వరుస పరాజయాలతో కొట్టు మిట్టాడుతున్న కాంగ్రెస్‌కు పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిన్న జరిగిన తొలి విడత ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారు ఒకరు గెలవడం విశేషం. గెలిచింది ఒక స్థానంలోనే అయినా, ఆ పార్టీ నేతల్లో మాత్రం బోల్డంత ఉత్సాహాన్ని నింపింది. దాదాపు కనుమరుగైన ఆ పార్టీ మద్దతు ప్రకటించిన అభ్యర్థి సర్పంచ్ గా గెలుపొందడంతో కాంగ్రెస్‌పై ప్రజల్లో ఇంకా అభిమానం ఉందని చెప్పడానికి ఇది ఉదాహరణ అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

 కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు పంచాయతీకి నిన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు గొంది సురేశ్ విజయం సాధించారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య జరిగిన ముక్కోణపు పోటీలో చివరికి కాంగ్రెస్ మద్దతుదారు విజయం సాధించాడు. దీంతో స్థానిక నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.
Congress
Andhra Pradesh
Gram Panchayat Elections
Chilukuru
Krishna District

More Telugu News