Aditi Singh: రామ మందిర నిర్మాణానికి భారీ విరాళాన్ని అందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Congress MLA Aditi Singh donates for Ayodhya temple
  • రూ. 51 లక్షల విరాళాన్ని ప్రకటించిన అదితి సింగ్
  • ఈ మొత్తాన్ని వీహెచ్పీకి అందజేస్తానని ప్రకటన
  • రామ మందిర నిర్మాణానికి భారీగా అందుతున్న విరాళాలు
అమోధ్య రామ మందిర నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, సాధువులు, సామాన్యులు అందరూ తమ వంతుగా విరివిగా విరాళాలను అందజేస్తున్నారు. అంతేకాదు పార్టీలకు అతీతంగా శ్రీరాముడిపై భక్తి భావంతో విరాళాలను ఇస్తున్నారు. ముస్లింలు సైతం విరాళాలు ఇస్తుండటం గమనార్హం.

తాజాగా కాంగ్రెస్ రాయబరేలి ఎమ్మెల్యే అదితి సింగ్ కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ. 51 లక్షల విరాళాన్ని ఆమె ప్రకటించారు. తన మద్దతుదారులు, బృంద సభ్యుల తరపున ఈ మొత్తాన్ని విశ్వ హిందూ పరిషత్ కు అందజేస్తానని చెప్పారు. రాయబరేలి ఎంపీగా సోనియాగాంధీ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విరాళాలు భారీ సంఖ్యలో అందాయి. ఒక మధ్యప్రదేశ్ నుంచే ఇప్పటి వరకు రూ. 100 కోట్లకు పైగా విరాళాలు అందినట్టు సమాచారం.
Aditi Singh
Congress
Ayodhya Ram Mandir
Donation

More Telugu News