మ్యూజిక్ ఆల్బమ్ చేసిన రష్మిక!
- తెలుగులో టాప్ డిమాండులో రష్మిక
- బాలీవుడ్ సినిమాలలో కూడా నటన
- 'టాప్ టక్కర్' ఆల్బమ్ లో డ్యాన్స్
- ఆల్బమ్ చేయడం ఇదే తొలిసారన్న రష్మిక
'టాప్ టక్కర్' పేరుతో సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, బాద్షా కలసి ఓ మ్యూజిక్ ఆల్బమ్ ను రూపొందిస్తున్నారు. ఇందులో రష్మిక డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన టీజర్ ను నిన్ననే విడుదల చేశారు.
దీని గురించి ఈ చిన్నది చెబుతూ, 'మ్యూజిక్ ఆల్బమ్ లో నేను డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి. ఈ అనుభవం బాగుంది. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది కూడా. ఇది త్వరలో మీ ముందుకు రానుంది. ఇకపై పెళ్లిళ్లు, కాలేజీలు.. వంటి చోట ఈ ఆల్బమ్ వినిపిస్తుందనుకుంటున్నాను.. దీని కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నను' అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది.