Kajal Aggarwal: ఐదేళ్ల వయసు నుంచి నేను ఈ వ్యాధితో బాధపడుతున్నా: కాజల్ అగర్వాల్

Kajal Aggarwal suffering from Asthma since 5 years age
  • బ్రాంకియల్ ఆస్తమాతో బాధపడుతున్నానని ప్రకటించిన కాజల్
  • శీతాకాలంలో ఇబ్బంది మరింత పెరుగుతుందని వ్యాఖ్య
  • ఇన్ హేలర్ వాడటం వల్ల రిలీఫ్ లభించిందన్న కాజల్
వయసు పెరిగినా వన్నె తగ్గని హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా ఆమె కొనసాగుతూ వస్తోంది. పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె దూకుడు తగ్గలేదు. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక విషయం గురించి వెల్లడించి అభిమానులను కాజల్ షాక్ కు గురి చేసింది.

ఐదేళ్ల వయసు నుంచి తాను బ్రాంకియల్ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నానని కాజల్ చెప్పింది. శీతాకాలంలో వ్యాధి మరింత ఎక్కువవుతుందని... ఈ వ్యాధి వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపింది. ఆస్తమా వల్ల ఆహారం విషయంలో కూడా తాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పింది.

ఆస్తమా నుంచి బయటపడేందుకు తాను ఇన్ హేలర్ వాడతానని కాజల్ తెలిపింది. ఇన్ హేలర్ వాడటం వల్ల కాస్త రిలీఫ్ లభించిందని చెప్పింది. అయితే ఇన్ హేలర్ వాడేందుకు చాలా మంది సిగ్గు పడుతుంటారని... ఎవరో ఏదో అనుకుంటారని భావించకూడదని, ఇన్ హేలర్ లు ఉపయోగించాలని సూచించింది.
Kajal Aggarwal
Decease
Illness
Tollywood

More Telugu News