England: భారత్ పై భారీ విజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ అవకాశాలు మరింత మెరుగుపర్చుకున్న ఇంగ్లండ్

England improves World Test Championship finals chances after win over India by a huge margin
  • చెన్నై టెస్టులో భారత్ పై ఇంగ్లండ్ గెలుపు
  • 227 పరుగుల భారీ తేడాతో విజయం
  • వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ కు అగ్రస్థానం
  • మరో రెండు టెస్టులు గెలిస్తే ఫైనల్స్ కు ఇంగ్లండ్
చెన్నై టెస్టులో ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన ఇంగ్లండ్ జట్టు భారత్ పై 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ భారీ విజయంతో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ చేరే అవకాశాలను ఇంగ్లండ్ మరింత మెరుగుపర్చుకుంది. భారత్ తో ఇంకా 3 టెస్టులు ఆడాల్సి ఉండగా, వాటిలో రెండు గెలిస్తే చాలు... లార్డ్స్ వేదికగా జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ లో ఆడుతుంది.

అటు భారత్ కూడా ఈ సిరీస్ లో రెండు టెస్టులు గెలిస్తే టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. భారత్ పై 227 పరుగుల భారీ తేడాతో సాధించిన విజయం ఇంగ్లండ్ ను వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన నిలిపింది. చెన్నై టెస్టు ఓటమితో భారత్ ఈ పట్టికలో నాలుగోస్థానానికి పడిపోయింది.
England
World Test Championship
Finals
Lord's
India
ICC

More Telugu News