Kushboo: తప్పు జరుగుతోందని తెలిసినా, ఆరేళ్లు మౌనంగా ఉండిపోయా: ఖుష్బూ

Actress Kushboo Latest Comments
  • నేనిప్పుడు ప్రజల మధ్య ఉన్నాను
  • తప్పు చేస్తే సొంత పార్టీనైనా నిలదీస్తా
  • తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ
కాంగ్రెస్ లో ఉన్నంత కాలమూ, తప్పు జరుగుతోందని తెలిసినా, ఆరేళ్ల పాటు మౌనంగా ఉన్నానని, ఇప్పుడు మాత్రం తాను ప్రజల మధ్య ఉన్నానని, తప్పు జరిగితే సొంత పార్టీనైనా నిలదీస్తానని నటి, బీజేపీ నేత ఖుష్బూ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ తమిళ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అవకాశం లభిస్తే చాలా సంతోషిస్తానని ఆమె అన్నారు.

ప్రస్తుతం దేశమంతా మోదీ హవా కొనసాగుతోందని అన్నారు. తమిళనాడులో బీజేపీ లేదని, చెన్నై దాటితే ఆ పేరు వినిపించదంటున్న మాటలో నిజం లేదని అన్నారు. ఇటీవల బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన వేల్ రథయాత్ర రాష్ట్రంలో ఎంత విజయవంతం అయిందో అందరూ చూశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ విషయం అందరికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కాగా, ఖుష్బూ చెన్నై నగరంలోని ట్రిప్లికేన్ అసెంబ్లీ  నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.
Kushboo
Tamilnadu
Interview
BJP

More Telugu News