Vijayanagara: కర్ణాటకలో కొత్త జిల్లా 'విజయనగర'.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Karnataka formed Vijayanagara as 31th district
  • విజయనగర జిల్లాను ఏర్పాటు చేయాలంటూ గతేడాది తీర్మానం
  • బళ్లారి నుంచి కొంత ప్రాంతాన్ని వేరు చేసి కొత్త జిల్లా
  • ఆరు తాలూకాలతో జిల్లా ఏర్పాటు
కర్ణాటకలో కొత్తగా మరో జిల్లా రూపుదిద్దుకుంది. బళ్లారి నుంచి కొంత ప్రాంతాన్ని వేరుచేసి హోస్పేట కేంద్రంగా విజయనగర జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 31కి పెరిగింది. విజయనగరను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ గతేడాది నవంబరు 18న మంత్రి వర్గం తీర్మానించింది. ఈ మేరకు తాజాగా కొత్త జిల్లా ఏర్పాటైంది.

 బళ్లారి నుంచి కొంత ప్రాంతాన్ని వేరు చేయడంతో ఇప్పుడా జిల్లాలోని తాలూకాల సంఖ్య ఐదుకు పడిపోగా, కొత్త జిల్లా విజయనగరలో ఆరు తాలూకాలు ఉంటాయి. కాగా, అఖండ బళ్లారి జిల్లాను వేరు చేయడం సరికాదంటూ అప్పట్లో మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి నేతృత్వంలో ఆందోళన కూడా జరిగింది.
Vijayanagara
Karnataka
District
Bellary

More Telugu News