Revanth Reddy: దక్షిణాదిలో సైతం రైతు ఉద్యమం బలంగా ఉందని చెప్పడమే మా లక్ష్యం: రేవంత్

Remanth comments on Modi and KCR
  • మోదీ, కేసీఆర్ ఒకే తాను ముక్కలు
  • వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదు
  • పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలు మా దృష్టికి వస్తున్నాయి
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందని టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒకే తాను ముక్కలని అన్నారు. తన పాదయాత్ర రెండో రోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.

తాను చేపట్టిన పాదయాత్రలో రైతు సమస్యలతో పాటు, ప్రభుత్వ తప్పిదాలు కూడా తమ దృష్టికి వస్తున్నాయని చెప్పారు. రైతుల ఉద్యమం ఉత్తరాదిలోనే ఉందని కొందరు అంటున్నారని... దక్షిణాదిలో సైతం ఉద్యమం బలంగా ఉందని చెప్పడమే తమ ఉద్దేశమని అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ, పార్లమెంటులో తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy
Congress
Narendra Modi
BJP
KCR
TRS

More Telugu News