Arvind Kejriwal: కేజ్రీవాల్ కూతురుని మోసం చేసిన కేటుగాళ్లు

Kejriwal daughter deceived by unknown person
  • ఆన్ లైన్ పోర్టల్ లో సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మాలనుకున్న హర్షిత
  • కొంత డబ్బు ట్రాన్స్ ఫర్ చేసి నమ్మించిన కేటుగాడు
  • ఆమె క్యూఆర్ కోడ్ ఉపయోగించి 34 వేలు దోచేశాడు
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కుమార్తె హర్షితా కేజ్రీవాల్ ఓ కేటుగాడి చేతిలో మోసపోయారు. వివరాల్లోకి వెళ్తే, ఓ ప్రముఖ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మాలనుకున్న హర్షితను కేటుగాడు మోసం చేశాడు. కొద్ది మొత్తంలో ఆమె అకౌంట్ కు డబ్బును ట్రాన్స్ ఫర్ చేసి ఆమెను నమ్మించాడు.

ఆ తర్వాత ఆమె పంపించిన క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి ఆమె అకౌంటులో ఉన్న రూ. 34 వేలను దోచేశాడు. దీనిపై పోలీసులకు హర్షిత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Arvind Kejriwal
AAP
Daughter

More Telugu News