Balakrishna: బోయపాటి సినిమా తర్వాత నేనేంటో చూపిస్తా: నెల్లూరు జిల్లా అభిమానితో ఫోన్ లో మాట్లాడిన బాలకృష్ణ!

Balakrishna interesting comments with a fan
  • తనలో ఒకవైపే చూశారన్న బాలయ్య
  • ఇక రెండో వైపు కూడా చూస్తారని వెల్లడి
  • దేనికీ భయపడేది లేదని స్పష్టీకరణ
  • మానసికంగా సిద్ధంగానే ఉన్నానని వ్యాఖ్యలు
టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నెల్లూరు జిల్లాకు చెందిన వీరాభిమాని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో ఫోన్ లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తనలో ఒకవైపే చూశారని, ఇకపై రెండో వైపు కూడా చూస్తారని అన్నారు. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నానని, ఆ సినిమా పూర్తయిన తర్వాత తానేంటో చూపిస్తానని స్పష్టం చేశారు. తన అసలు అవతారం అప్పుడు చూస్తారని, ఎవరికీ బయపడేది లేదని అన్నారు.

"ఏదైతే అదే అవుతుంది... నేను కూడా అందుకు మానసికంగా సిద్ధపడుతున్నాను" అంటూ వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోందని, ఇది దురదృష్టకర పరిణామం అని విమర్శించారు. ఒకప్పుడు ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాలను అరాచకానికి మారుపేరుగా పోల్చేవారమని, ఇప్పుడు మన రాష్ట్రాన్ని పోల్చాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Balakrishna
Fan
Kotamreddy
Nellore District
Telugudesam

More Telugu News