Somireddy Chandra Mohan Reddy: వెంకయ్యనాయుడిపై విజయసాయి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: సోమిరెడ్డి

Somireddy condemns Vijaysai Reddy comments on Venkaiah Naidu
  • రాజ్యసభలో వెంకయ్యపై విజయసాయి వ్యాఖ్యలు
  • మనసు బీజేపీతో, తనువు టీడీపీతో అని విమర్శలు
  • వెంకయ్య ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారన్న సోమిరెడ్డి
  • విజయసాయి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్
మనసు బీజేపీతో, తనువు టీడీపీతో అంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. రాజ్యసభలో వెంకయ్యనాయుడిపై విజయసాయి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

నెల్లూరు నుంచి దేశంలో రెండో అత్యున్నతస్థాయికి ఎదిగిన తెలుగుబిడ్డను చూసి ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. ఎప్పటినుంచో ఈర్ష్యతో రగిలిపోతున్న వైసీపీ నేతలు ఈ రోజు బయటపడ్డారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, వెంకయ్యనాయుడితో పాటు తెలుగు ప్రజలందరికీ వైసీపీ క్షమాపణలు చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. అటు, వెంకయ్యనాయుడు దీనిపై స్పందిస్తూ వ్యక్తిగతంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు బాధించాయని తెలిపారు.
Somireddy Chandra Mohan Reddy
Vijay Sai Reddy
Venkaiah Naidu
Rajya Sabha
YSRCP

More Telugu News