Chandrababu: ఎన్నికల అక్రమాలకు మంత్రి పెద్దిరెడ్డి బాధ్యత వహించాలి: చంద్రబాబు

Chandrababu says minister Peddireddy should take responsibility for elections offences
  • పుంగనూరు నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
  • అక్రమాలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేయాలని సూచన
  • న్యాయపోరాటం చేద్దామని పిలుపు
  • నామినేషన్లు వేయకుండా పోలీసులే బెదిరిస్తున్నారని ఆరోపణ
  • అక్రమాలపై ఎస్ఈసీ, డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరు టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అక్రమాలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేయాలని నేతలకు సూచించారు. వైసీపీ ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.  నామినేషన్లు వేయకుండా పోలీసులే బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 26 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని వెల్లడించారు. ఎన్నికల అక్రమాలపై మంత్రి పెద్దిరెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అక్రమాలపై ఎస్ఈసీ, డీజీపీ చర్యలు తీసుకోవాలని అన్నారు.
Chandrababu
Peddireddi Ramachandra Reddy
Gram Panchayat Elections
SEC
DGP
Punganuru
Chittoor District

More Telugu News