Volunteers: విజయవాడలో వలంటీర్ల ఆందోళనలో ఉద్రిక్తత

Volunteers agitation at Vijayawada MIuncipal Corporation office
  • వేతనాలు పెంచాలంటున్న వలంటీర్లు
  • ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
  • విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన
  • వలంటీర్లను అడ్డుకున్న పోలీసులు
వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ విజయవాడలో సచివాలయ వలంటీర్లు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్దకు వలంటీర్లు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వేలాది మంది వలంటీర్లు రావడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. తమకు రూ.10 వేల జీతం, ఉద్యోగ భద్రత కల్పించాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రోడ్లన్నీ వలంటీర్లతో నిండిపోయాయి.
Volunteers
Vijayawada
Agitation
YSRCP
Andhra Pradesh

More Telugu News