Kotia Villages: ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లోని ఈ 21 గ్రామాలకు డబుల్ ధమాకా... ఎందుకంటే..!

Double benefits for AP and Odisha border Kotia villages
  • నాడు ఏపీ, ఒడిశా రాష్ట్రాల సర్వే
  • సరిహద్దు గ్రామాల్లో జరగని సర్వే
  • దాంతో 21 గ్రామాలపై సందిగ్దత
  • అటు ఒడిశా, ఇటు ఏపీ పథకాలు పొందుతున్న గ్రామాలు

ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో విజయనగరం, కోరాపుట్ జిల్లాలు ఉంటాయి. ఏపీలో విజయనగరం జిల్లా ఉండగా, ఒడిశాలో కోరాపుట్ జిల్లా ఉంది. అయితే, ఈ రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని 21 గ్రామాలకు దేశంలోని మరే ప్రాంతాలకు లేని ప్రత్యేకత ఉంది. ఈ గ్రామాలను కొటియా గ్రామాలు అని పిలుస్తారు. నాడు ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సర్వే జరిగినప్పుడు ఈ కొటియా గ్రామాల్లో సర్వే చేపట్టలేదు. దాంతో ఆ గ్రామాలపై హక్కులు ఎవరివన్నది తేలలేదు.

కొటియా గ్రామాలు తమవంటే తమవని ఏపీ, ఒడిశా రాష్ట్రాలు దశాబ్దాల కిందటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అయితే ఈ విషయాన్ని పార్లమెంటులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు. దాంతో ఆ 21 గ్రామాల ప్రజలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పథకాలు అందించడం ప్రారంభించాయి.

అటు ఒడిశా ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఇటు ఏపీ సర్కారు అందించే పథకాలను వీళ్లు పొందుతారు. అంతేకాదు, ఓట్లు కూడా ఒక్కొక్కరికి రెండేసి ఉంటాయి. ఒకటి ఒడిశా ఓటు కాగా, మరొకటి ఏపీ ఓటు. ఒడిశా ఎన్నికల్లోనూ వీరు ఓటేస్తారు, ఏపీ ఎన్నికల్లోనూ తమ ఓటు హక్కు వినియోగించకుంటారు. రేషన్ కార్డులు, పింఛన్లు సరేసరి. ఈ గ్రామాల్లో ఒకటి ఒడిశా పాఠశాల ఉంటే, మరొకటి ఏపీ పాఠశాల ఉంటుంది. ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ రెండేసి చొప్పున ఉంటాయి. ఈ గ్రామాలు ఎవరివన్నది తేలకపోవడంతో ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు రెండూ ఈ విధంగా తమ పాలన కొనసాగిస్తున్నాయి.

  • Loading...

More Telugu News