Susan Sarandon: రైతులకు సంఘీభావం ప్రకటించిన హాలీవుడ్ సీనియర్ నటి

Hollywood actress Susan Sarandon supports farmers
  • నూతన వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిన కేంద్రం
  • చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు
  • ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం
  • మద్దతు పలికిన గ్రెటా థన్ బర్గ్, రిహాన్నా తదితరులు
  • ఇప్పుడు వారిబాటలోనే సుసాన్ సరాన్ డాన్
భారతదేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది. ఇప్పటికే స్వీడిష్ పర్యావరణ వేత్త గ్రెటా థన్ బర్గ్, పాప్ క్వీన్ రిహాన్నా తదితరులు రైతు ఉద్యమానికి మద్దతు పలికి భారత వర్గాల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా హాలీవుడ్ సీనియర్ నటీమణి సుసాన్ సరాన్ డాన్ రైతులకు మద్దతు పలికారు. రైతులకు తాను సంఘీభావం ప్రకటిస్తున్నట్టు సుసాన్ వ్యాఖ్యానించిందని న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థ పేర్కొంది.

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను పూర్తిగా ఎత్తివేయాలంటూ రైతులు గత రెండు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్నారు. ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన సంఘటనలతో అంతర్జాతీయంగానూ రైతు ఉద్యమం మీడియా దృష్టిని ఆకర్షించింది. దాంతో గ్రెటా థన్ బర్గ్, రిహాన్నా వంటి ప్రముఖులు రైతులకు మద్దతుగా ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో వీరిపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మరిప్పుడు సుసాన్ మద్దతు పలకడంపై ఎలాంటి స్పందనలు వస్తాయో చూడాలి!
Susan Sarandon
Hollywood
Farmers
India
Farm Laws

More Telugu News