Mahesh Babu: షార్జా ఎడారుల్లో షూటింగును ఎంజాయ్ చేస్తున్న మహేశ్

Mahesh Babu shoots in Sharjha and enjoys the shoot
  • దుబాయ్ లో మొదలైన మహేశ్ షూటింగ్ 
  • ప్రస్తుతం యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ
  • అక్కడి అందాలను వర్ణించిన మహేశ్  
మన తారలు తమ సినిమాల షూటింగుల కోసం ఎక్కడెక్కడికో వెళుతుంటారు. ఒక్కోసారి అక్కడి లొకేషన్ల అందాలకు ముగ్ధులవుతుంటారు. ప్రస్తుతం మహేశ్ బాబు కూడా అలాగే తన అవుట్ డోర్ షూటింగును బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. 

పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ తన తాజా చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. 'సర్కారు వారి పాట' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్నాళ్లుగా దుబాయ్ లో జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం షార్జా సమీపంలోని చారిత్రాత్మక మిలీహా పరిసరాల్లో జరుగుతోంది. అక్కడి ఎడారుల్లో యాక్షన్ దృశ్యాలను భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి లొకేషన్ ఫొటోలను మహేశ్ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

"షార్జాలోని మిలీహా ప్రాంతంలో షూటింగ్ చేయడం నిజంగా అద్వితీయమైన అనుభవం. చూడగానే ఆకట్టుకునే ప్రకృతి దృశ్యాలు.. అద్భుతమైన వినోద కార్యకలాపాలు.. ఇక్కడి పరిసరాలు చెప్పే అందమైన కథలు నా మదిలో చిరకాలం మధురజ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. ఇక్కడి వాతావరణం.. ఆతిథ్యం అద్భుతం" అంటూ మహేశ్ తన అనుభూతులను వ్యక్తం చేశాడు.
Mahesh Babu
Keerti Suresh
Parashuram

More Telugu News