Hymavathi: సీనియర్ నటుడు కాంతారావు అర్ధాంగి కన్నుమూత

Hymavathi dies of heart attack in Hyderabad
  • హైదరాబాదులో కన్నుమూసిన హైమావతి
  • హైమావతి వయసు 87 సంవత్సరాలు
  • గుండెపోటుకు గురైన హైమావతి
  • 2009లో మరణించిన కాంతారావు
తెలుగు చిత్రసీమలో జానపద చిత్రాలకు పెట్టింది పేరు కాంతారావు. కత్తి వీరుడు కాంతారావు అనేంతగా ఆయన ప్రజల హృదయాల్లో చెరగనిస్థానం సంపాదించుకున్నారు. కాంతారావు 2009లో కన్నుమూయగా, తాజాగా ఆయన అర్ధాంగి హైమావతి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. హైదరాబాదులోని మల్లాపూర్ లో తమ నివాసంలో ఆమె కన్నుమూశారు.  

నటుడు కాంతారావు, హైమావతి దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా, కాంతారావు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేలు పెన్షన్ గా అందిస్తోంది. కాంతారావు చరమాంకంలో ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన తన కెరీర్లో జానపద చిత్రాల్లోనే ఎక్కువగా నటించారు. దర్శకుడు విఠలాచార్యతో ఆయన కాంబినేషన్ బాగా హిట్టయింది.
Hymavathi
Demise
Heart Attack
Kantharao
Tollywood

More Telugu News