India: భారత బౌలర్లకు సవాల్... నిదానంగా నిలదొక్కుకుంటున్న ఇంగ్లండ్ ఓపెనర్లు!

England Openers Study Going in 1st Test
  • బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్
  • 23 ఓవర్లలో 57 పరుగులు
  • నలుగురు బౌలర్లను వాడిన కోహ్లీ
చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్లు డామ్ సిబ్లీ, రోరీ బుర్న్స్ లు భారత బౌలర్లకు సవాల్ విసురుతున్నారు. నిదానంగా ఇన్నింగ్స్ ను ప్రారంభించిన వీరిద్దరూ, క్రమంగా తమ జట్టు స్కోరును ముందుకు తీసుకుని వెళుతున్నారు.

ఆట 23 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టపోకుండా 59 పరుగులకు స్కోరు చేరుకుంది. సిబ్లీ 83 బంతుల్లో మూడు ఫోర్లతో 26 పరుగుల వద్ద, బుర్న్స్ 55 బంతుల్లో ఒక ఫోర్ తో 29 పరుగుల వద్ద తమ ఆటను కొనసాగిస్తున్నారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే నలుగురు బౌలర్లను వాడాడు. అయినా ఫలితం లేకపోయింది. ఇషాంత్ శర్మ 5, జస్ ప్రీత్ బుమ్రా 6, రవిచంద్రన్ అశ్విన్ 8, షాబాజ్ నదీమ్ 4 ఓవర్లు వేశారు.
India
Cricket
Test
Chennai

More Telugu News