పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాపై దాఖలైన రెండు పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
- పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు
- 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు
- 2021 జాబితాతో ఎన్నికలు జరపాలంటూ పిటిషన్లు
- ప్రభుత్వం కొత్త జాబితా ఇవ్వడంలో విఫలమైందన్న ఎస్ఈసీ
- ఎస్ఈసీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు
దాంతో ఎస్ఈసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ... కొత్త ఓటర్ల జాబితాను అందించడంలో ప్రభుత్వం సహకరించలేదని, అందుకే తాము పాత ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందని విన్నవించారు. అంతేకాదు, ఓటర్ల జాబితాపై ఎస్ఈసీదే తుది నిర్ణయం అవుతుందని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 2019 నాటి ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు జరుగుతాయని పిటిషనర్లకు తేల్చిచెప్పింది.